Friday, May 16, 2025

నాంపల్లిలో పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి చంపారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని ఎంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయారు. ఘటనా స్థలంలో సదరు వ్యక్తి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు పూల్ బాగ్ కు చెందిన రౌడీ షీటర్ ఆయాన్ ఖరేష్ గా గుర్తించారు. పాత కక్ష్యల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల భయబ్రాంతులకు గురయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News