Friday, May 16, 2025

ఆటో,ట్రక్ ఢీకొని ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో హర్దౌల్ మౌ గ్రామంలో ఉదయం 9.45 గంటలకు ఓ ఆటోరిక్షా, డంపర్ ట్రక్‌ను ఢీకొనడంతో ఆరుగురు మరణించారు, ముగ్గురికి గాయాలయ్యాయి అని అధికారులు తెలిపారు. ఆటోరిక్షా బంగార్‌మౌ నుంచి సందిలకు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితులందరినీ వెంటనే సందిలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కాగా అక్కడ ఆరుగురు చనిపోయినట్లు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని లక్నోలోని ట్రౌమా సెంటర్‌కు రిఫర్ చేశారని పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిలో ఓ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఆటో డ్రైవర్ రంజిత్, ప్రయాణికులు అంకిత్ కుమార్, అర్వింద్, ఫూల్ జహాన్, నిసార్, ఓ గుర్తు తెలియని మహిళ ఉన్నారు. యాక్సిడెంట్‌కు సంబంధించి చట్టపర చర్యలు ఆరంభించారు. మరణించిన వారి మృత దేహాలను పోస్ట్ మార్టంకు పంపించినట్లు పోలీస్ సూపరింటెండెంట్ నీరజ్ కుమార్ జదౌన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News