మన తెలంగాణ / హైదరాబాద్: ఆర్ఓఎఫ్ఆర్ హక్కులు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిర సౌర గిరిజల వికాసం పథకం జీవో విడుదలైంది. ఈ పథకానికి రూ. 12,600 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈనెల 18న సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు పొంది ఉన్న 2.10 లక్షల మంది రైతులకు ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే విధంగా పథకం రూపకల్పన చేశారు. యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకువచ్చిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ప్రకారంగా తెలంగాణలో హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్దిక జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రూపకల్పన చేసింది. ఈ పథకానికి సంబంధిం చి గురువారం గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ డాక్టర్ ఏ శరత్ జీవో విడుదల చేశారు.
2006 సంవత్సరంలో వచ్చి న ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్ ఓ ఎఫ్ ఆ ర్ హక్కు పత్రాలు పొంది ఉన్న 2.10 లక్షల మంది రైతులకు ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన ఈ పథకానికి 12,600 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సిఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడానికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పర్యవేక్షణలో ఈ పథకం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల పనులను అధికారులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. 2006 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఆర్ ఓ ఎఫ్ ఆర్ యాక్టు తీసుకొచ్చిం ది.
ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఆరు లక్షల 69 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. గత దశాబ్ద కాలం అధికారం లో ఉన్న గత పాలకులు గిరిజన రైతులుకు సాగునీరు అందించడం, మంచి పంటలు పండించడానికి తగిన స హాయం చేయడానికి ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదు. ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభు త్వం అడవిలో పుట్టి అడివిలో పెరిగి అడవినే జీవనాధా రం చేసుకుని బతుకుతున్న గిరిజనుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచన చేసి ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ద్వారా భూ పట్టాలు ఇచ్చిన గిరిజన రైతులు పంటలు పండించుకోవడానికి ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సౌర శక్తి విద్యుత్ సౌకర్యం అందించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఉద్యాన వన పంటలకు కావలసిన మొక్కలు ఇవ్వడం, ఆ పంటల నుండి ఆ దాయం వచ్చేంత వరకు అదనపు ఆదాయం కల్పించడానికి అంతర పంటలకు సౌకర్యం కల్పిస్తూ గిరిజనుల ఉ న్నతి కోసం ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తున్నది.
సమగ్ర భూ అభివృద్ధి పనులు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఉద్యానవన పంటలకు తోడ్పాటు ఇచ్చి తద్వారా గిరిజన రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచాలని 2006 సంవత్సరంలో తీ సుకొచ్చిన ఆర్‌ఓఎఫ్ ఆర్ చట్టంలో పేర్కొన్నప్పటికీ దేశంలోని గిరిజన ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లో భూములపై హక్కు పత్రాలు ఇచ్చాయే తప్ప, ఏ రాష్ట్రంలో కూడా సా గునీటి వసతి కల్పించే విధంగా పథకాలను తీసుకురాలే దు. కానీ మొట్ట మొదటి సారిగా దేశంలోని తెలంగాణ ప్రభుత్వం ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టంలో పేర్కొన్న విధంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రవేశ పెడుతూ దేశానికి రోల్ మోడల్ గా నిలవనుంది.
పథకంపై సంక్షిప్త నివేధిక
తెలంగాణ ప్రభుత్వం ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం,2006 ప్రకా రం, 2,30,735 గిరిజనులకు అటవీ భూములపై హక్కులను గుర్తించి, 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అ టవీ భూమిపై యాజమాన్యపు హక్కులు సంక్రమింపజే స్తూ ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కు పత్రాలను జారీ చేసింది. ఇప్పటివరకు, 23,886 ఎస్‌టి రైతులకు చెందిన 69,039 ఎ కరాల భూమికి వివిద పథకాల కింద రూ.141.57 కోట్ల వ్యయంతో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరిగిం ది. విద్యుత్తు సంబంధిత అంశాలపై అటవీ శాఖ అభ్యంతరాల వలన 2,10,000 ఎస్టీ రైతులకు సంబంధించిన మి గిలిన 6.00 లక్షల ఎకరాలు నీటిపారుదల సౌకర్యం, ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి చర్యలు చేపట్టలేదు.
10.01.2025 తేదీన జరిగిన సమావేశంలో ముఖ్యమం త్రి ప్రత్యేక పథకం కింద 100శాతం గ్రాంట్‌తో ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములను కలిగి ఉన్న గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్‌లను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని ప్రకారం 2,10,000 మంది గిరిజన రైతులకు చెందిన 6.00 లక్షల ఎకరాల ఆ ర్‌ఓఎఫ్‌ఆర్ చభూములు, అటవీ ప్రాంతంలోని నాన్ ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములు సమగ్ర భూ అభివృద్ధి కొరకు ఆఫ్-గ్రిడ్ ఆధారిత నీటిపారుదల సౌకర్యం ఎస్‌టిఎస్‌ఎఫ్ కింద యూనిట్ ఖర్చుతో రూ.12,600 కోట్ల మొత్తం బడ్జెట్ వ్యయంతో చేపట్టుట కొరకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకం రూపొందించారు.