Tuesday, July 1, 2025

కాళేశ్వరం క్షేత్రాన్ని రూ.200 కోట్లు

- Advertisement -
- Advertisement -

సంస్కృతి, సంప్రదాయాలను
భవిష్యత్ తరాలకు అందించడమే
లక్షం సరస్వతీ పుష్కరాల
ఘాట్లను ప్రారంభించిన
అనంతరం జరిగిన సభలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: రూ.200 కోట్లతో కాళేశ్వర క్షేత్రాన్ని అభివృ ద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలోని త్రి వేణి సంగమం కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాల సంబధిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా త్రివేణి సం గమం వద్ద నూతనంగా నిర్మించిన 17 అడుగుల ఏకశిల సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం సంగమంలో మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఆ త ర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగ తం పలికారు.ఆలయన్ని ద ర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు.అనంతరం సరస్వతి ఘట్ వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంస్కృతిని, సం ప్రదాయాలను కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు అందించడమే ప్రభుత్వ లక్షమని అన్నారు. పుష్కరాలకు

వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో, జిల్లా యంత్రాంగం సహాయంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారని అన్నారు. మన వారు దేవాలయాలను, నదులను దేవతులుగా భావించడం మనం చూస్తాన్నామని అన్నారు. రాబోయే మూడేళ్లల్లో గోదావరి, కృష్ణా, ప్రాణహిత, సమ్మక్క సారక్క జాతరలు తన హయాంలోనే రానుండడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వాటికి పునాదిగానే ఈ సరస్వతి పుష్కర ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మ్రంతి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వర క్షేత్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా, ఆదర్శప్రాంతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంథని ప్రాంతానికి ఒక చరిత్ర ఉందని, దేశ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను ముందు వరుసలో ఉంచిన పివి నరసింహారావు ఈ ప్రాంతవాడు కావడం, అనంతరం ఆయన వారససత్వాన్ని శ్రీపాదరావు తీసుకొని స్పీకర్‌గా మంథని ప్రాంత అభవృద్ధికి తోడ్పడ్డారని, మూడో వారసునిగా శ్రీధర్‌బాబు మంథని ప్రాంతమే కాకుండా రాష్ట్రం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

పలు దేశాల నుండి పెట్టుబడులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ యువతకు లక్ష ఉద్యోగాల కల్పనే లక్షంగా పనిచేస్తున్నారని అన్నారు. శ్రీధర్‌బాబుకు మంథనివాసులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా సమయం ఇవ్వాలని కోరారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉండడం ప్రకృతి వరంగా భావించాలని అన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మాస్టర్ ప్లాన్ వేసి గ్రీన్ చానల్ నుండి నిధులు మంజూరు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు సత్యనారాయణరావు, మక్కాన్‌సింగ్, కెఆర్ నాగరాజు, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రామ్, కలెక్టర్ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News