Friday, May 16, 2025

నడ్డా ఆదేశంతో వెనక్కి తగ్గిన కంగన

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ వద్దని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ ను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తొలగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యక్తిగతం గా ఫోన్ చేయడంతో తాను పోస్ట్ ను తొలగించినట్లు కంగనా తెలిపారు. ఆపిల్ సంస్థ భారతదేశంలో విస్తరించడం పట్ల ట్రంప్ ఎందుకు కంగారు పడుతున్నారంటూ రనౌత్ ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు. ట్రంప్ ను ప్రధాని మోదీతో పోలుస్తూ మరో వ్యాఖ్య చేసింది. తాను వ్యక్తిగత హోదాలో ఆ పోస్ట్ పెట్టానని,

అయినా పార్టీ ఆదేశం మేరకు తొలగించానని కంగనా పేర్కొన్నారు. కంగనా రనౌత్ తొలగించిన పోస్ట్ లో ట్రంప్ కు భారత్ పై ప్రేమ తగ్గడానికి కారణం ఏమిటి.వ్యక్తిగత అసూయా, దౌత్య పరమైన అభద్రతా,, ట్రంప్ అమెరికా అధ్యక్షుడే. కానీ ప్రపంచంలో అత్యంత ప్రియమైన నాయకుడు మోదీ. ట్రంప్ రెండో సారి ప్రెసిడెంట్ కాగా, మోదీ మూడో సారి ప్రధాని అయ్యారు. ట్రంప్ ఆల్ఫా పురుషుడైతే, మోదీ అల్ఫా పురుషుడి బాప్.. అని మీరు ఏం అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News