Friday, May 16, 2025

బిర్యానీలో బల్లి..

- Advertisement -
- Advertisement -

ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌ తింటున్న బిర్యానీలో బల్లి కన్పించింది ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే..గుజ్జా కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందినవాడు. కృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్‌ రహదారిలోని మెహఫిల్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. కాగా, ఆయన తింటున్న చికెన్‌ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కృష్ణారెడ్డి రెస్టారెంట్‌ యజమానిని ప్రశ్నించగా రెస్టారెంట్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

బల్లి నే కదా  మంచిగానే  ఫ్రై అయ్యిందిగా తినమన్నాడు. ఆ తర్వాత రెస్టారెంట్‌ యజమానిని అడగగా కృష్ణారెడ్డితో ఏమి చేసుకుంటావో చేసుకో మన్నాడు. వెంటనే కృష్ణారెడ్డి  బిర్యానీ లో ఉన్న బల్లిని తన మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకొని  అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకొని  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెస్టారెంట్‌  వద్దకు వెళ్లగా అప్రమత్తమైన రెస్టారెంట్‌ యజమాని దానికి తాళం వేసి పరారైనట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News