Friday, May 16, 2025

పిడుగుపాటుకు సిఆర్‌పిఎఫ్ అధికారి మృతి

- Advertisement -
- Advertisement -

అడ‌వుల్లో కూంబింగ్‌కు వెళ్లిన ఓ సిఆర్‌పిఎఫ్ ఆఫీస‌ర్ పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో గురువారం రాత్రి  చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని కెరిబూరు గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో గురువారం రాత్రి సిఆర్‌పిఎఫ్ బ‌ల‌గాలు కూంబింగ్ చేప‌ట్టాయి. అయితే రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో భారీ వ‌ర్షంతో పిడుగులు ప‌డ్డాయి. పిడుగుపాటుకు సీఆర్పీఎఫ్ అధికారి ఎం ప్ర‌భో సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మ‌రో ముగ్గురు  అధికారులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News