Saturday, May 17, 2025

దోహా డైమండ్ లీగ్‌ 2025.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దోహా డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఆండర్సన్ పీటర్స్, జూలియన్ వెబర్స్ వంటి స్టార్‌లతో పోటీ పడుతూ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

శుక్రవారం(మే 16) జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో తన మూడవ త్రోలో చోప్రా 90 మీటర్ల మార్కును చేరుకున్నాడు. చోప్రా 90.23 మీటర్ల దూరం బల్లెంను విసిరి రికార్డు నెలకొల్పాడు. తొలిసారి తన కెరీర్ లో 90 మీటర్ల మార్కును చోప్రా సాధించాడు. అయితే, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్ల ఫైనల్ త్రోతో విజయం సాధించారు. దీంతో చోప్రా రెండోస్థానంలో నిలిచారు. ఇక, గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ ఈ ఈవెంట్‌లో మూడవ స్థానంలో నిలివగా.. భారత్ కు చెందిన కిషోర్ జెనా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News