Saturday, May 17, 2025

‘శుభం’ లాంటి మంచి చిత్రాలని తీస్తూనే ఉంటాం

- Advertisement -
- Advertisement -

ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. (Shubham)హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షా లినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ చిత్రా న్ని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతూ రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. “పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ‘శుభం’ మూవీ కి పని చేసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీ స్తూనే ఉంటారు.

నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలు సు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ నాకు మళ్లీ గు ర్తుకు వచ్చాయి. అవన్నీ నిన్నే జరిగినట్టు గా అనిపించాయి. ‘శుభం’తో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. మేము ఇలాంటి మంచి చిత్రాలను తీసి ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రాలాలా లక్ష్యం. దాని కోసం ఎం తైనా కష్టపడుతూనే ఉంటాం”అని అన్నా రు. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. “సమంత లేకపోతే ఈ మూవీ ని ఎవరు చూస్తారు? సమంత వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి చిన్న చిత్రాలని ఆడియెన్స్ ప్రోత్సహిస్తూ ఉం డాలి.

శుభం లాంటి మూవీని సక్సెస్ చేస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తా యి. మేం నిజాయితీగా తీసిన ఈ మూ వీని థియేటర్లో అందరూ ఎంజాయ్ చే స్తున్నారు.ఇలాంటి కథకు ప్రతి భాషలో రీమేక్ అయ్యే సత్తా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాలను సమంత ఇంకా ఇంకా నిర్మిస్తూనే ఉండాలి”అని తెలిపారు. రచయిత వసంత్ మాట్లాడుతూ.. “అందరి సమిష్టి కృషి వల్లే సినిమా వస్తుంది. ‘శుభం’తో నాకు ఆ విషయం అర్థమైంది. క థను నిజాయితీగా రాయాలని రాజ్ అం డ్ డీకే చెబుతుంటారు. వారి సలహాలను నేను ఎప్పుడూ తీసుకుంటాను. సమంత ఫస్ట్ ప్రాజెక్ట్‌కి నేను కథ ఇవ్వడం గర్వం గా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంశీధర్, హర్షిత్ రెడ్డి, శ్రియా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి, చరణ్, షాలినీ, హిమాంగ్, శశి, రామ్, పూజిత, రాగ్ మయూర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News