Monday, May 19, 2025

బాదల్ సర్కార్

- Advertisement -
- Advertisement -

1925 జూలై 15న జన్మించిన సుప్రసి ద్ధ నాటక కర్త, దర్శకుడు బాదల్ సర్కార్ మే 13, 2011 నాడు మరణించారు. కలకత్తాలో జన్మించిన ఆయన అసలు పేరు సుధీంద్ర సర్కార్.
‘థర్డ్ థియేటర్’గా పిలవబడే ప్రత్యామ్నాయ నాటక రంగానికి ఆద్యుడైన బాదల్ సర్కార్ 1967లోనే ‘శతాబ్ది’ అనే థియేటర్ గ్రూప్‌ని ప్రారంభించారు. నాట క రంగంలో అనేక ప్రయోగాలు చేసిన బాదల్ సర్కార్ 50కి పైగా నాటకాలను స్వయంగా రచించి, ప్రదర్శనలు ఇచ్చారు.

1968లో ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’, 1972లో ‘పద్మశ్రీ’ అవార్డుతో సహా అనేక అవార్డులను ఆయన పొందా రు. నాటక, సినిమా రంగాల్లోని అనేకమంది దర్శకులు, నటులపైన ఆయన ఎనలేని ప్రభావాన్ని నెరిపారు. శతాబ్ది సంస్థ ద్వారా నుక్కడ్ నాటకాన్ని ప్రజలతో అనుసంధానం చేయడంలో బాదల్ సర్కార్ కృషి ఎనలేనిది.
పిచ్చి గుర్రం, ఇంద్రజీత్, రాత్రంతా, అంతం లేదు, సగిన మెహతా, అబూహాసన్, ఊరేగింపు, రామ్ శ్యామ్ జోడు, కవి కథ, మూడో శతాబ్దం, వల్లభపూర్ రూప కథ, అబూహాసన్, సగిన మహతో, స్పార్టక స్ మొదలైన ఆయన నాటకాలు చరిత్ర సృష్టించాయి.

భారత దేశపు అత్యంత ప్రజాదరణ పొందిన నాటక రచయితలలో బాదల్ సర్కార్ ఒకరు. డెబ్బయ్యవ దశాబ్దంలో మోహన్ రాకేష్, విజయ్ టెండూల్కర్, గిరీష్ కర్నాడ్, ధర్మవీర్ భారతి, బాదల్ సర్కార్ వంటివారి నాటకాలు భారత థియేటర్‌కు సరికొత్త దిశానిర్దేశం చేసాయి. ఆడిటోరియం నుంచి థియేటర్‌ను బయటకు తేవడానికి ఆయన కృషి చేసారు.
ప్రాంగణం, వేదిక అనే సిద్ధాంతం పైన చర్చ చేసిన బాదల్ సర్కార్ నాటకాన్ని వీధుల్లోకి, జనం మధ్యకు తీసుకురావడం తో పాటూ, నుక్కడ్ నాటకాలను పాపులర్ చేసారు.

సమకాలీన థియేటర్‌ను డిబేట్‌లోకి తీసుకురావడంలో బాదల్ సర్కార్ ముఖ్య పాత్ర వహించారు. మూడవ థియేటర్ వ్యవస్థాపకుడుగా, భారతీయ గ్రామీణ సంప్రదాయ థియేటర్ పునరుద్దరణ, ఆధునిక థియేటర్‌ను నాలుగు గోడల మధ్య నుండి సామాన్య ప్రజల మధ్యకు తీసుకురావడం, రాజకీయ చైతన్యంతో థియేటర్ ను ఒక బలమైన మాధ్యమంగా వినియోగించడం ఆయన ఎంతో ప్రతిభావంతంగా చేసారు.
భారతీయ నాటకాలు, నుక్కడ్ నాటకాల అభివృద్ధి కోసం బాదల్ సర్కార్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గానూ ఆయనకి నివాళి.
– సుబ్రహ్మణ్యం, ఢిల్లీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News