ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ నుంచి వైదొలతున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కి బిసిసిఐ తెలిపినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి.. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట బిసిసిఐ. దీంతో ఆసియా కప్ (Asia Cup) పూర్తిగా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగే ఆసియా కప్‌తో మాహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ (Asia Cup) నుంచి కూడా వైదొలగాలని బిసిసిఐ నిర్ణయించినట్లు సమాచారం. అందుకు కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, పాక్ మంత్రి మోసిన్ నఖ్వీ ఉన్నాడు. దీంతో పాక్ మంత్రి అథినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నమెంట్‌లు భారత్ ఆడదని బిసిసిఐ (BCCI) అధికరి ఒకరు చెప్పారు. ఆది దేశ సెంటిమెంట్ అని అన్నారు. మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగుతున్నామని.. ఎసిసికి తెలిపామని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎసిసి టోర్నమెంట్‌లకు కూడా దూరంగా ఉంటామని.. దీనిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సదరు అధికారి తెలిపారు.
ఇదే జరిగితే స్పాన్సర్లు, ప్రసారకర్తలు తీవ్రంగా నష్టపోతారు. భారత, పాకిస్థాన్ వంటి ఉత్కంఠభరితమైన మ్యాచులు లేకుండా టోర్నమెంట్‌ను చూసేందుకు ఎవరు ఇష్టపడరు. దీంతో టోర్నెంట్‌నే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.