లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఆరంభం నుంచి లక్నో ఆటగాడు దిగ్వేష్ రాఠీ (Digvesh Rathi) వివాదాలకు కేంద్రంగా ఉంటున్నాడు. వికెట్ తీసిన ప్రతీసారి అతను నోట్‌బుక్ స్టైల్‌లో సెలబ్రేషన్ చేసుకొని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కి ఆగ్రహం తెప్పించాడు. ఎన్నిసార్లు ఫైన్ వేసిన అతడు తన తీరును మాత్రం మార్చుకోలేదు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో అభిషేక్ శర్మ (Abhishek Sharma) వికెట్ తీసిన దిగ్వేజ్ ఇంకాస్త మితిమీరి ప్రవర్తించాడు. దీంతో అతనిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది.
ఈ సీజన్‌తో ఆరంగేట్రం చేసిన 23 ఏళ్ల దిగ్వేష్.. సీజన్ ఆరంభం నుంచి ఏ ఆటగాడి వికెట్ తీసిన నోట్‌బుక్‌లో రాసుకుంటున్నట్లు సైగ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దీని కారణంగా దిగ్వేష్ ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించి చాలాసార్లు గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో జరిమానాలతో గవర్నింగ్ కౌన్సిల్ మొట్టికాయలు వేసిన దిగ్వేష్ తీరులో మార్పు రాలేదు.
తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ వికెట్ తీసిన దిగ్వేష్ సెలబ్రేష్‌లో ఓవరాక్షన్ చేశాడు. చేతితో వెళ్లిపో అంటూ అభిషేక్‌కి సైగలు చేశాడు. అభిషేక్ (Abhishek Sharma) కూడా అతని సహనాన్ని కోల్పోయి.. సీరియస్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు, తోటి క్రీడాకారులు సర్ది చెప్పడంతో ఇద్దరు వెనక్కి తగ్గారు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. దిగ్వేష్‌తో (Digvesh Rathi) మాట్లాడానని.. ప్రస్తుతం అంతా సద్దుమణిగి కూల్ అయిపోయాం అని చెప్పాడు. కానీ, నిబంధనలు ఉల్లంఘించినందుకు దిగ్వేష్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్.. ప్రతి స్పందించినందుకు అభిషేక్‌కి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.