- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన 12 మ్యాచ్ ల్లో 9 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్ చేరింది. ఇక, ఇప్పటిరకు 12 మ్యాచ్ ల్లో 5 మాత్రమే గెలిచిన లక్నో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో గెలిచి తమ టాప్ పొజిషన్ ను మరింత పదిలం చేసుకోవాలని గుజరాత్ జట్టు భావిస్తుండగా.. లక్నో, గుజరాత్ ను ఓడించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
- Advertisement -