మనతెలంగాణ/క్రీడావిభాగం: ఐపిఎల్ సీజన్ 2025 లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) అసాధారణ ఆటతో ప్లేఆఫ్ బె ర్త్‌ను సొంతం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచుల్లో మూడింటిలో పరాజయం పాలైన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఏకంగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. ఆరంభ మ్యాచుల్లో ముంబై ఆటను చూసిన వారికి హా ర్దిక్ సేన ముందుకు వెళ్లడం కష్టమేనని అనిపించింది. వరుస ఓటములతో జట్టు డీలా పడిపోయింది. ఇ లాంటి స్థితిలో జట్టు పని అయిపోయిందని విశ్లేషకు లు సయితం అంచనాకు వచ్చారు. అయితే ముంబై మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ మళ్లీ గాడిలో పడింది.
హార్దిక్ పాం డ్య అద్భుత కెప్టెన్సీకి అనుభవజ్ఞులు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సలహాలు, సూచనలు తోడు కావడంతో ముంబై మళ్లీ పూర్వం సంతరించుకుంది. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను హ డలెత్తింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి పెను ప్ర కంపనలు సృష్టించింది. ముంబైని (Mumbai Indians) ఓడించేందుకు ఇత ర జట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ శ ర్మ, రికెల్టన్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందించారు. రోహిత్ ఫామ్‌లోకి రావ డం ముంబైకి కలిసి వచ్చిన అంశంగా మారింది. రో హిత్, సూర్యకుమార్ యాదవ్‌లు అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు అండగా నిలిచారు. ఇద్దరు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. రికెల్టన్ కూడా రోహిత్‌కు మంచి సహకారం అందించాడు. ఈ ముగ్గురు నిలకడగా ఆడడం తో ముంబై బ్యాటింగ్ పటిష్టంగా మారింది. వీరికి తో డు నమన్‌ధిర్, తిలక్‌వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య, విల్‌జాక్స్ తదితరులు కూడా తమతమ బ్యాట్‌లను ఝులిపిస్తూ జట్టును ఆదుకున్నారు.
సమష్టిగా ముందుకు..
ముంబై ప్లేఆఫ్‌కు చేరిందంటే దానికి సమష్టి పోరాటమే కారణమని చెప్పాలి. కిందటి సీజన్‌లో జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమైన కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈసారి తన తీరును పూర్తిగా మార్చుకున్నాడు. జట్టులో ఐకమత్యాన్ని నింపుతూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్, రోహిత్, బౌల్ట్, బుమ్రాలతో సమన్వయం చేసుకుంటూ లక్షం దిశగా అడుగులు వేశాడు.
ఇక సహచరులు కూడా హార్దిక్‌కు పూర్తి సహకారం అందించా రు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఆటగాడు తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. సమష్టిగా రాణిస్తూ జట్టుకు విజయాలు సాధిం చి పెట్టారు. ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన 8 విజయాలు అందుకుంది. ఆరంభంలో మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై (Mumbai Indians) ఆ తర్వాత సమష్టిగా ముందుకు సాగింది. వరుస విజయాలతో ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో ముంబై ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. రానున్న మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.