Saturday, May 24, 2025

నటిపై పలుమార్లు అత్యాచారం… హీరో అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సహచర నటిపై పలుమార్లు అత్యాచారం చేయడంతో హీరో మనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మడనేరు మను అనే నటుడు కిలాడిగాళు అనే కామిడీ షోలు చేసేవాడు. మను నటించిన కులదాళ్లి కీలయవుడో అనే సినిమా రెండో రోజుల క్రితం విడదలైంది. కిలాడిగాళ్లు అనే కామిడీ షోలో మణుతో ఓ నటి కలిసి పని చేస్తోంది. 2022లో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు నటిని హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు అతడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో గర్భవతి కావడంతో అబార్షన్ కూడా చేయించాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశాడని, ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో అతడి వేధింపుల ఎక్కువ కావడంతో పాటు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News