Saturday, May 24, 2025

హైదరాబాద్ గెలుపు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (62), కోహ్లి (43) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పో యింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు శుభారంబం అందించారు. ధాటిగా ఆడిన హెడ్ 10 బంతుల్లోనే 3 ఫోర్ల తో 17 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన అభిషేక్ 17 బంతుల్లోనే మూడు ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇషాన్ కిషన్ తనపై వేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన ఇషాన్ స్కోరు ను పరిగెత్తించాడు. అతనికి క్లాసెన్ (24), అనికేత్ వర్మ (26) అండగా నిలిచారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 48 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 6 వికెట్లకు 231 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News