లక్నో: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(RCB) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయం సాధించింది. ఈ ఓటమితో ఆర్‌సిబి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోవడమే మేలని ఆర్‌సిబి ఆటగాడు ఫిల్‌సాల్ట్ (Phil Salt) అభిప్రాయపడ్డాడు. ‘మా జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.. కానీ, మ్యాచ్‌లో ఓడిపోవడానికి ఎవరూ ఇష్టపడరూ.. అయితే ఎలిమినేటర్‌లో ఓడిపోవడం కంటే.. ఇప్పుడు ఓడిపోవడమే బెటర్’ అని సాల్ట్ (Phil Salt) అన్నాడు.
అయితే ఆర్‌సిబి తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ కూడా ఇలానే అన్నాడు. ‘ఈ ఓటమి మంచిదే’ అంటూ అతను సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఇది అతన్ని ఇబ్బందుల్లో పడేసేలా ఉండటంతో.. భారత మాజీ ఆటగాడు.. సవరణ చేశారు. ‘ప్లేఆఫ్స్‌నకు ముందు ఈ ఓటమి ఓ మేలుకొలుపు. లోపాలు సరిదిద్దుకొని, ముఖ్యమైన మ్యాచుల్లో తిరిగి పుంజుకొనే అవకాశం లభిస్తుంది’ అని శాస్త్రీ పేర్కొన్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగా.. ఆర్‌సిబి (RCB) 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.