- Advertisement -
జైపూర్: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్‌తో(PBKS) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ముంబైపై ఓటమితో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి.. టోర్నమెంట్‌ని విజయంతో ముగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ(DC) జట్టుకు అక్షర్ పటేల్‌కి బదులుగా డుప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నాడు. పంజాబ్(PBKS) జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లీష్, స్టోయినిస్‌ని తిరిగి జట్టులోకి తీసుకుంది.
- Advertisement -