ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గురువారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్.. ఈ సమావేశం తర్వాత ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని సిఎం రేవంత్ రెడ్డి.. ప్రధానిని కోరినట్లు సమాచారం.
అలాగే.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ పర్మిషన్స్ ఇవ్వాలని.. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని సిఎం రేవంత్, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధానికి వివరించిన సిఎం రేవంత్.. ఈ డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం కోసం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది.