Sunday, June 15, 2025

హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ సిటీలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం నుంచి వాన పడుతోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, సనత్‌ నగర్‌, అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్‌, ఆల్వాల్‌, మియాపూర్‌, లింగంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకపూల్‌, లిబర్టీ, ఆబిడ్స్, కోఠి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడు, తార్నాక తదితర ప్రాంతాల్లో వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ముందుకు కదలలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జిహెచ్ ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News