Monday, May 26, 2025

చివరి లీగ్‌ మ్యాచ్‌కి ముందు ఆర్‌సిబికి గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 18వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కి చేరింది. అయితే లీగ్ దశలో ఆడే చివరి మ్యాచ్‌కి ముందు ఆ జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొద్ది మ్యాచ్‌లకు దూరమైన స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) తిరిగి అందుబాటులోకి వచ్చాడు. శనివారం అతను జట్టుతో జతకట్టాడు. మే 27న లక్నోతో జరిగే మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండనున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ముగించవచ్చు. అయితే హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడటం జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ (Josh Hazlewood) లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ మ్యాచ్‌లో ఆర్‌సిబి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో లక్నోతో జరిగే మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ రాక జట్టుకు పెద్ద బలాన్ని చేకూరుస్తుంది. హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News