అహ్మదాబాద్: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెన్నై 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డేవన్ కాన్వాయ్‌లు జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ప్రశిధ్ బౌలింగ్‌లో మాత్రే(34) ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన ఉర్విల్ పటేల్(37).. దూకుడుగా బ్యాటింగ్ చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శివమ్ దూబే 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్న కాన్వాయ్(52) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేసి అర్థశతకం సాధించాడు. కానీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అతను పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సులతో 57 పరుగులు చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా(21) కూడా అతనికి మంచి సహకారం అందించాడు. దీంతో 20 ఓవర్లలో చెన్నై(CSK) 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ (GT) బౌలింగ్‌లో ప్రశిధ్ 2, సాయి కిశోర్, రషీద్, షారుఖ్ తలో వికెట్ తీశారు.