- Advertisement -
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తన చివరి మ్యాచ్‌ని ఘన విజయంతో ముగించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో(GT) జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు బ్యాటర్లు లక్ష్య చేధనలో తడబడ్డారు. చెన్నై బౌలర్ల ధాటికి ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు. సాయి సుదర్శన్(41) మినహా మిగితా బ్యాటర్లు స్వల్పస్కోర్‌లకే పరిమితమయ్యారు. దీంతో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. చెన్నై బౌలింగ్‌లో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరి మూడు, జడేజా 2, ఖలీల్, పతిరానా తలో వికెట్ తీశారు.
- Advertisement -