- Advertisement -
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మెడీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు ప్రధాని మోడీ అని ప్రశంసలు కురిపించారు. సోమవారం చెన్నైలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. ముందు ప్రారంభిస్తే.. తర్వాత వచ్చే అడ్డంకులు అధిగమించొచ్చని చెప్పారు. సమస్యలు లేవని తాను చెప్పనని.. కానీ వాటిని అధిగమించగలమని, భారత్‌కు ఉన్న సామర్థ్యంతో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమేనని పవన్ అన్నారు.
- Advertisement -