న్యూఢిల్లీ: ఐపిఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అభిమానులకే కాదు.. ప్రేక్షకులందరికీ.. కావాల్సినంత వినోదాన్ని అందించింది. అయితే ఈ విజయంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) కీలక పాత్ర పోషించాడు. తన బ్యాటింగ్‌తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
దీంతో ఐపిఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్లాసెన్ (Heinrich Klaasen) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్‌రేటు(269.23)తో సెంచరీ పూర్తి చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా రెండో బ్యాట్స్‌మెన్‌గా క్లాసెన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూ క్లాసెన్ అందుకున్నాడు.