పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు‘. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫోటోలు, టీజర్, సాంగ్స్ మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘తార తార’ అంటూ సాగే సిజ్లింగ్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
‘హాటెస్ట్ ట్రాక్ ఆఫ్ ది ఇయర్’ కోసం సిద్ధంగా ఉండంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మే 28న ఉదయం 10.20 నిమిషాలకు ఫుల్ సాంగ్ ను వదలబోతున్నామని చెబుతూ.. ఈ సాంగ్ లో చిందులేసిన నిధి అగర్వాల్ ఫోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ నిధి తన అందాలతో సెగలు పుట్టించేలా కనిపిస్తున్నారు. దీంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.