- Advertisement -
ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో (MI) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు రికెల్టన్(27), రోహిత్ శర్మ పర్వాలేదనిపించారు. సూర్య కుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు) అర్థ శతకంతో అలరించాడు. హార్దిక్ పాండ్య (26), నమన్ ధీర్(20), విల్ జాక్స్(17) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2, మార్కో యాన్సెస్ 2, అర్ష్ దీప్ సింగ్ 2, హరప్రీత్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు.
- Advertisement -