Thursday, May 29, 2025

ముంబయి పై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ తర్వాత 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కొల్పొయి 187 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్(73; 42 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్స్ లు), ప్రియాంశ్ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ లు) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ అయ్యర్ (26) నాటౌట్ గా నిలిచాడు.  ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న పంజాబ్ తొలి క్వాలిఫయర్ కు అర్హత సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News