Thursday, May 29, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడుతున్నాయి. ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి విజయం సాధిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి వెళ్లి మొదటి క్వాలిఫయర్‌కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ లక్నో విజయం సాధిస్తే.. మూడోస్థానంలోనే ఉండి.. ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఆర్‌సిబికి ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఆర్‌సిబి జట్టులోకి లివింగ్‌స్టోన్, తుషారా రాగా, లక్నో జట్టులోకి బ్రీట్జ్కే, దిగ్వేష్ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News