Monday, July 28, 2025

దిగ్వేష్ నోట్‌బుక్ సెలబ్రేషన్ వెనుక ఇంత కథ ఉందా..!

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంత ప్రభావం చూపించలేకపోయింది. భారీ అంచనాలతో లీగ్ ప్రారంభించిన లక్నో 14 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అయితే లక్నో జట్టులోని స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ (Digvesh Rathi) మాత్రం చర్చల్లో నిలిచాడు. అందుకు కారణం అతను చేసే సెలబ్రేషనే. ప్రతీసారి వికెట్ తీసినప్పుడల్లా నోట్‌బుక్‌లో రాస్తున్నట్లు సెలబ్రేట్ చేసుకోవడం (Notebook Celebrations) అతనికి అలవాటు. అయితే చాలా సందర్భాల్లో అతను శృతి మించి సెలబ్రేట్ చేసుకోవడంతో అతనిపై పలు మార్లు జరిమానా కట్టాడు. అయినా అతని తీరు మారలేదు.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వికెట్ తీసిన అతను ఇంకాస్త శృతి మించడంతో అభిషేక్‌తో గొడవ జరిగింది. ఈ కారణంగా దిగ్వేష్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే ఈ నోట్‌బుక్ సెలబ్రేషన్ వెనుక కారణాన్ని దిగ్వేష్ (Digvesh Rathi) ఓ అభిమానికి వెల్లడించాడు. ‘‘ఎప్పుడు టోర్నీ జరిగినా.. నోట్‌బుక్‌ తీసుకెళ్తా. అందులో అందరి పేర్లు రాసుకుంటా’’ అని దిగ్వేశ్‌ సమాధానమిచ్చాడు. అయితే మ్యాచ్‌కి ముందు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లు బుక్‌లో రాసుకొని.. తన బౌలింగ్‌లో ఔటైన ఆటగాడి పేరును కొట్టేస్తాడు. దీంతో ఫలానా ఆటగాడిని ఔట్ చేశానని రికార్డు చేసుకోవడమే దిగ్వేష్ నోట్‌బుక్ సెలబ్రేషన్ (Notebook Celebrations) ఉద్దేశమని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News