Sunday, July 20, 2025

లేఖను బయట పెట్టిన వారిని పట్టుకోవాలి: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు (CM KCR) లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు. లేఖను బయట పెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు. తనకంటూ సొంత జెండా, అజెండా లేదని చెప్పారు. కెసిఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని, బిజెపిలో పార్టీ విలీనాన్ని తాను ఒప్పుకోనని కవిత తెలియజేశారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, తాను జైల్లో ఉన్నప్పుడు బిజెపితో పొత్తు ప్రస్తావన ఆవేదన కలిగించిందని కవిత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News