Friday, June 6, 2025

ఆ తర్వాతే ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. ఇప్పటివరకూ వచ్చిన అన్ని అప్‌డేట్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే జూన్ 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ, ఇప్పటివరకూ సినిమా ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత ఎఎం రత్నం ట్రైలర్ గురించి అప్‌డేట్ ఇచ్చారు.

హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా రెండో భాగంలో సిజి వర్క్ చాలా ఎక్కువగా ఉందని.. అందుకే ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఆ పనులన్ని కొలిక్కి వచ్చాక ట్రైలర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత సమయం పడుతుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల తేదీని ప్రకటించాం అని ఎఎం రత్నం పేర్కొన్నారు. ఇక ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు క్రిష్‌దే అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News