గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ నభా నటేష్. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన ఈ పోస్ట్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్‌తో ప్రకృతి గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ రాస్తున్నారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో నభా స్పందిస్తూ “ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను…ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది.
ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన ప్రకృతికి రుణపడి ఉంటాను”అని పేర్కొంది. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన మూవీస్‌లో నటిస్తోంది నభా నటేష్. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో ఆసక్తికరమైన మూవీ నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగబంధం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్‌లో ఉన్నాయి.