Monday, June 9, 2025

ఇంటర్వెల్ వాకింగ్.. ఇప్పుడిదే ట్రెండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చే యాలని అడిగితే ఎవరైనా సరే ముందు మం చి ఆహారం తీసుకోవాలని చెప్తారు. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అంటారు. ఎక్కువ మంది ఇచ్చే సలహా వాకింగ్. అన్ని వయసుల వారికి వీలుగా ఉండేది ఈ వాకింగ్. ఒకప్పుడు ఏమో తెలియ దు కానీ కొవిడ్ మహమ్మారి తర్వాత చాలా మందిలో ఆరోగ్యంపై ఫోకస్ పెరిగింది. అందులో భాగంగా వాకింగ్‌పై దృష్టి పెడుతున్నారు. జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద వర్కవుట్లు చేయడం, జి మ్‌కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయ డం ఇష్టం లేని వాళ్లకు ఈ వాకింగ్ సింపుల్ సొల్యూషన్‌గా మారింది. యువకులు మొదలుకొని వృద్ధులు దాకా చాలామంది తమ శక్తిమేర కు వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉం డడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడయాలో కొత్త రకం ఫిట్‌పెస్ ట్రెండ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మిగ తా ఎక్సర్‌సైజ్‌లతో పోలిస్తే తక్కువ సమయం లో ఎక్కువ ప్రయోజనాలు అందించే దీని పేరే జపనీస్ వాకింగ్. రోజుకు 10 వేల అడుగులు వేస్తే ఆరోగ్యకరమని అందరూ సాధారణంగా నమ్మే సూత్రం. కాస్త వయసు మళ్లిన వృద్ధులయితే 6 నుంచి 8వేల అడుగులు వేయాలని చె ప్తారు. ఇందుకోసం ఇప్పుడు కొన్ని స్మార్ట్ వా చ్‌లు కూడా వచ్చాయి. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయనేది నిజం. అయితే ఇంతకు మిం చిన ప్రయోజనాలు రావాలంటే మాత్రం ఈ జపనీస్ వాకింగ్‌ను ఫాలో కావాలని నిపుణులు అంటున్నారు. దీనికే ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ అనే మరో పేరు కూడా ఉంది. సాధారణ నడకకన్నా ఈ తరహా వాకింగ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కేవలం అరగంట సేపు చేస్తే చాలు.

జపాన్ మట్సుమోటో లోని షిన్షు యూనివర్సిటీలో పని చేసే ప్రొఫెసర్ హిరోషి నోస్, అసోసియేట్ ప్రొఫెసర్ షిజుయె మసుకిలో ఈ విధానాన్ని అభివృద్ధి చేయడంతో దీనికి జపనీస్ వాకింగ్ అనే పేరు పాపులర్ అయింది. వాకింగ్ అంటే చెమటలు పట్టేలా వేగంగా నడవcమని చాలా మంది భావిస్తారు. కానీ ఓ పద్ధతి ప్రకారం నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుందనేది ఈ టెక్నిక్ చెప్పే సూత్రం. ముందుగా ఓ మూడు నిమిషాల పాటు మెల్లగా నడవాలి. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు వేగంగా నడవాలి. మళ్లీ మూడు నిమిషాలు మెల్లగా నడవాలి. ఇలా ఓ అరగంట చేస్తే మామూలు వాకింగ్ వల్ల వచ్చే ఆరోగ్యంకన్నా రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత అలవాటయితే రొటీన్‌గా మారిపోతుంది. దీనివల్ల రక్తపోటు( బిపి) పూర్తిగా కంట్రోల్ అయిందని, ఒత్తిడి పూర్తిగా తొలగిపోయిందని అంటున్నారు. అంతేకాదు గుండెపోటు వచ్చే రిస్క్ కూడా దాదాపు 40 శాతం తగ్గిపోయిందని జపాన్‌లో నిర్వహించిన పరిశోధనల్లో తేలిందట. అందుకే ఇప్పుడు అక్కడ ఈ తరహా వాకింగ్‌ను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మనం కూడా మొదలు పెట్టేద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News