Monday, June 9, 2025

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ఎన్‌బికె 111..

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. ఆయన పుట్టినరోజు (జూన్ 10) పురస్కరించుకొని బాలకృష్ణ 111వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. ఎన్‌బికె 111 చిత్రానికి బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు. భారీ బ్లాక్ బస్టర్ హిట్ వీరసింహరెడ్డి తర్వాత ఇది వారి సెకెండ్ కొలాబరేషన్.(Second Collaboration) ప్రస్తుతం ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఉగ్ర సింహం ఫెరోషియస్ ఇమేజ్ వుంది. దాని ముఖంలో సగం లోహ కవచం, మిగిలిన సగం వైల్డ్‌గా కనిపిస్తోంది.

ఈఅద్భుతమైన ఇమేజ్ బాలకృష్ణ ఈ చిత్రంలో పోషించబోయే ఇంటెన్స్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని తెలియ జెస్తోంది. మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో అదరగొట్టే దర్శకుడు గోపీచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లోకి అడుగుపెట్టనున్నారు. బాలకృష్ణ కోసం ఆయన ఇంతకుముందు చూడని అవతార్‌ను రూపొందిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. బర్త్ డేకి డబుల్ ట్రీట్.. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ’అఖండ 2: తాండవం’ కోసం నాలుగోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుందని హామీ ఇస్తోంది.

ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. అఖండ 2 ఫస్ట్ లుక్, టీజర్ జూన్ 9న, బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల కానున్నాయి. ఈ పోస్టర్‌లో నంది, డమరుకంతో కూడిన త్రిశూలం కనిపిస్తుంది, దాని నేపథ్యంలో విశ్వ దిక్సూచి ఉంటుంది. ఇది బాలకృష్ణ పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ అవుతుంది.. సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. అఖండ2 చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న ధియొటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News