- Advertisement -
హైదరాబాద్: నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాలనలో సంక్షేమ పథకాలన్నీ నేరుగా పేదలకు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అవినీతి లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ‘‘ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, పారదర్శక పాలనకు మోడీ ప్రభుత్వం ఉదాహరణ’’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 29 శాతం ఉన్న పేదరికాన్ని 11.28 శాతానికి తగ్గించామని, గతంలో ఢిల్లీ నుంచి రూ.100 వస్తే రూ. 85 దళారీలు దోచుకునేవారు (Brokers were looters) అని అన్నారు. పన్నుల విధానంలో సమగ్రమైన మార్పులు తీసుకొచ్చామని తెలియజేశారు. జిఎస్టి వచ్చిన తర్వాత అవినీతి, మోసాలు తగ్గాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -