Friday, July 18, 2025

కెసిఆర్ ఓపెన్‌కోర్టులో వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు..?:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

ఈటల రాజేందర్, హరీష్‌రావులు ఓపెన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే, కెసిఆర్ మాత్రం ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా రాష్ట్ర బాగు కోసమే కట్టి ఉంటే, ఇప్పుడు ఈ విచారణ అవసరం ఉండేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఎంపి చామల విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్పులు ముమ్మాటికీ దోచుకోవడానికే జరిగాయని ఆయన ఆరోపించారు. కమిషన్ మీద ఎలాంటి ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని ఆయన తెలిపారు. కాళేశ్వరం విచారణ వెనుక రేవంత్ రెడ్డి కక్ష్య పూరిత దురుద్దేశం ఉందన్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలను ఎంపి చామల తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News