కొన్ని నెలల్లో భారత కార్ల మార్కెట్లోకి అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. మహీంద్రా నుండి విన్‌ఫాస్ట్ వంటి కొత్త కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. రాబోయే 9-12 నెలల్లో విడుదల కానున్న కార్లు ఇప్పటికే టెస్టింగ్ టైం లో కనిపించాయి. కొత్త కార్ల జాబితాను గురుంచి తెలుసుకుందాం.
నెక్స్ట్-జెన్ మహీంద్రా బొలెరో
మహీంద్రా తన తదుపరి తరం బొలెరోను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ ఏడాది ఆగస్టులో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈసారి ఈ SUVలో అనేక మార్పులను చూడవచ్చు. డిజైన్ నుండి ఇంటీరియర్ వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. కొత్త బొలెరో 1.5L డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. భద్రత కోసం..ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS + EBD సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ వాహనం ధర దాదాపు 10 లక్షలు ఉండవచ్చు.
నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది కాంపాక్ట్ SUV విభాగంలో తన ప్రసిద్ధ SUV వెన్యూను విడుదల చేయవచ్చు. కొత్త వెన్యూ డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. కొత్త వెన్యూ డిజైన్‌లో క్రెటా, అల్కాజార్‌ల ప్రేరణ పొందిందనితెలుస్తోంది. ఇందులో 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్లు కలిగి ఉంటాయి. వెన్యూలో 1.5L డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుందని సమాచారం. నెక్స్ట్ జెన్ వెన్యూ ధర 8 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చు.
విన్‌ఫాస్ట్ VF6, VF7
ఈ ఏడాది వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ పండుగ సీజన్‌లో ఇండియాలో తన రెండు కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తమిళనాడులో తన స్థానిక ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరం కంపెనీ VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తుంది. ఈ కార్లు 59.6 kWh, 75.3 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. పూర్తిగా ఒకసారి ఛార్జ్ చేస్తే.. 480 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.