- Advertisement -
బషీర్ బాగ్: హైదరాబాద్ మహానగరంలోని ఎల్‌బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా కౌంట్ డౌన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేత, నటి ఖష్బూ, సినీ నటులు మినాక్షీ చౌదరి, సాయి దుర్గా తేజ్, తేజా సజ్జ, తదితరలు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
- Advertisement -