Monday, June 23, 2025

బాలికను నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించి… స్నేహితులకు వీడియో షేర్ చేసిన బాలుడు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: బాలికతో స్నేహంగా ఉండి ఆమెను బెదిరించి ఓ బాలుడు నగ్న వీడియోలు తీశాడు. నగ్న వీడియోలను తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు బాలుర్లతో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో బాలికలో ఓ బాలురు స్నేహంగా ఉండేవాడు. ఆమెతో రోజు వాట్సప్‌లో బాలుడు చాటింగ్ చేసేవాడు.

నగ్నంగా వీడియో కాల్ చేయాలని లేకపోతే చాటింగ్‌ను తల్లిదండ్రులకు చూపిస్తానని బాలికను బాలుడు బెదిరించాడు. బాలిక భయంతో నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీంతో వీడియో కాల్‌ను రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో బాలికను లైంగికంగా, శారీరకంగా వేధించడంతో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇద్దరు బాలుర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. మిగిలిన యువకుడు కారడ సుధీర్(28), వరుణ్(18), వంశీకృష్ణ(20), బాలవంత్ సింగ్(18), విఠల్(23), తరుణ్(18)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News