- Advertisement -
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి సగటు సముద్రమట్టం నుంచి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడిందని పేర్కొంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిక్కుల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -