Thursday, June 26, 2025

నేటి నుంచి బోనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, అత్యంత వైభవంగా, ఇంటిల్లిపాది నిర్వహించుకునే ఆషాడమాస బోనాలు నేటి (జూన్ 26) నుంచి ప్రారం భం కానున్నాయి. జులై 24తో ముగియనున్నా యి. గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిహెచ్‌ఎంసికి
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్‌ఎంసి, అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసి సుమారు రూ. 20 కోట్లతో నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలు, పూల మాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా అధికారులు తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.

గోల్కొండ బోనంతో..
గ్రేటర్ హైదరాబాద్‌లో గోల్కోండలోని అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఆషాడమాస బోనాల జాతర ప్రారంభమవుతంది. గోల్కొండలో మొదలై.. లాల్ దర్వాజ బోనాలతో నగరంలో బోనాల జాతరలు ముగుస్తాయి. నేడు గోల్కొడ అమ్మవారికి తొలిబోనం సమర్పించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నేటి నుంచి 29 తేదీ వరకు నాలుగు రోజులపాటు అమ్మవారి బోనాల జాతర అత్యంత కనుల పండువగా కొసాగుతుంది. వచ్చేనెల జులై 3వ తేది నుంచి 6వ తేది వరకు మరో నాలుగు రోజుల పాటు గోల్కోండలో అమ్మవారికి రెండో పూజతో స్థానికంగా బోనాలు పండుగ జరుపనున్నారు. వచ్చేనెల జులై 13న లష్కర్ (సికింద్రాబాద్) ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతర నిర్వహిస్తారు. జులై 24వ తేదిన గ్రేటర్‌లో బోనాలు ముగియనున్నాయి. హైదరాబాద్ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు వచ్చే నెల 20వ తేదిన ప్రారంభమై 24వ తేదిన ముగియనున్నాయి. లాల్ దర్వాజ బోనాలతో బోనాల ఉత్సవాలు పూర్తిగా ముగిసినట్టుగా నగర ప్రజలు పాటిస్తూ వస్తున్నారు.

సీఎంకు ఆహ్వానం..
సికింద్రాబాద్(లష్కర్) ఉజ్జయినీ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఈపాటికే ఆలయ ప్రతినిధులు, అధికారులు ఆహ్వానించారు. సిఎంతో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గత సోమవారం నాడు ఆహ్వాన పత్రికలను అందజేశారు. సికింద్రాబాద్ బోనాలు జూలై 13, 2025న జరుగనున్నాయి. ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News