సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూలీ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చికిటు అంటూ సాగే ఈ సాంగ్‌ను మ్యూజిక్ వీడియోగా మేకర్స్ విడుదల చేశారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మరోసారి అదిరిపోయే క్యాచీ ట్యూన్‌తో కంపోజ్ చేసిన విధానం సూపర్‌గా ఉంది. ఇక ఈ మాస్ సాంగ్‌కు థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. అటు ఈ పాటకు రజనీకాంత్ కూడా తనదైన డ్యాన్స్ స్టెప్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
కాగా మరో వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ టి.రాజేంద్రన్ కూడా మనకు ఈ మ్యూజిక్ వీడియోలో కనిపిస్తారు. మొత్తానికి మరోసారి రజనీకాంత్-, అనిరుధ్ కాంబోలో అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్ రానుందని ఈ పాట తెలియజేసింది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల (Released worldwide 14th) చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ కూడా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ పోటీ పడ్డారు. చివరికి ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ దక్కించుకున్నారట. తమిళ చిత్ర తెలుగు రైట్స్ అందుకున్న రెండో హయ్యస్ట్ చిత్రంగా ‘కూలీ’ నిలిచింది.