Friday, August 15, 2025

పూరిలో తొక్కిసలాట ఘటన.. కలెక్టర్, పోలీసులపై వేటు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: జగన్నాథ రథయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కలెక్టర్, పోలీసులపై ఒడిశా ప్రభుత్వం వేటు వేసింది. ఆదివారం ఉదయం పూరిలోని గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయి.. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఖుర్దా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ వినీత్ అగర్వాల్‌లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝీ ఆదేశించారు. తొక్కిసలాటకు దారితీసిన నిర్లక్ష్యం క్షమించరానిదని డిసిపి బిష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధితో సహా ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు సిఎం మాఝీ అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కొత్త కలెక్టర్‌గా చంచల్ రాణాను సిఎం మాఝీ నియమించారు. ఇక, అగర్వాల్ స్థానంలో ఎస్టీఎఫ్ డీఐజీ పినాక్ మిశ్రా పూరి ఎస్పీగా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News