Saturday, December 14, 2024

13మంది ఐఎఎస్‌లు బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో పాటు ఐఎఫ్‌ఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. పరిపాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ ప్రక్షాళనను చేపట్టింది. అం దులో భాగంగా 13 మంది ఐఏఎస్‌లతో పాటు 8 మంది ఐఎఫ్‌ఎస్‌లకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌కు టూరిజం కల్చరల్ సెక్రటరీగా అదనంగా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. బిసి వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీధర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనితా రామచంద్రన్, జీహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఇలంబర్తి, డిప్యూటీ సిఎం ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న

కృష్ణ భాస్కర్‌ను ట్రాన్స్‌కో సిఎండీగా బాధ్యతలను అప్పగించారు. ఇక రవాణాశాఖ కమిషనర్‌గా సురేంద్ర మోహన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్‌గా శ్రీజన, ఆయూష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్, ఇంటర్మీడియట్ డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, కార్మిక శాఖ కమిషనర్‌గా సంజయ్ కుమార్, జిఏడి సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఐఎఫ్‌ఎస్‌లకు సంబంధించి ప్రియాంకవర్గీస్, శివాల రాంబాబు, డా.సునీల్ ఎస్.హైరమత్, ఎస్.వి.ప్రదీప్‌కుమార్ శెట్టి, పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, జే.వసంత, నవీన్‌రెడ్డిలను ప్రభుత్వం బదిలీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News