- Advertisement -
హైదరాబాద్: బర్త్ డే పార్టీ ఇస్తామని ఓ రౌడీ షీటర్‌ను అతని సహచరులే హత్య చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్లాపూర్‌లో సయ్యద్ షాహీద్(23) అనే రౌడీషీటర్ తను భార్య షమీం బేగం, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తున్నాడు. షాహీద్‌కు పవన్, మున్నా, సమీర్ అనే సహచరులు ఉన్నారు.
పవన్ జన్మదిన వేడులక సందర్భంగా షాహీద్‌ను పిలిచారు. కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ సమీపంలో పెట్రోల్ బంకు వెనక ఖాళీ స్థలంలో ఐదుగురు కలిసి పవన్‌తో పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్నారు. ఐదుగురు మద్యం తాగిని తరువాత గొడవ జరిగింది. దీంతో నలుగురు కలిసి బీరు సీసాలతో షాహీద్ గొంతులో పొడిచి హత్య చేశారు. షాహీద్ తండ్రి వాహేద్ గ్యాంగ్ స్టర్ ఉండేవాడు. 2016లో వాహేద్ కూడా అనుచరుల చేతిలో చనిపోయాడు.
- Advertisement -