Wednesday, July 2, 2025

‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసిందిగా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నితిన్ ప్రధాన పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా బాంగర్, పాటలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ని వదిలారు చిత్ర యూనిట్. ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. అక్క కోసం పోరాటం చేసే తమ్ముడిగా నితిన్ ఈ సినిమాలో కనిపిస్తాడని.. ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాతో (Thammudu) నటి లయ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఝాన్సీ కిరణ్మయి అనే పాత్రలో ఈ సినిమాలో ఆమె కనిపించనున్నారు. రత్న అనే పాత్రలో సప్తమి గౌడ, చిత్ర అనే పాత్రలో వర్ష బొల్లమ్మ, గుత్తి అనే పాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్(విలన్) పాత్రలో సౌరభ్ సచ్‌దేవ్ ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బి. అజనీశ్ లోక్‌నాథ్ సినిమాకు సంగీతం సమకూర్చారు. జూలై 4వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News