- Advertisement -
సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఫార్మా కంపెనీలో సోమవారం భారీ పేలుగు ఘటన తరహాలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీ పేలుడు సంభవించింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఆల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్‌కు చెందిన మూల శ్రీనివాస్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తునాడు. ఉదయం కంపెనీలో బాయిలర్ ఒకసారిగా పేలడంతో అతను కుప్పకూలిపోయాడు. దీంతో కంపెనీ లోని తోటి కార్మికులు అతనిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం బయటకి రాకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.
- Advertisement -