Wednesday, July 2, 2025

భర్త వేధింపులు.. చందానగర్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః భర్త వేధింపులను తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్ర, కోల్హాపూర్‌కుచెందిన అరుణ శివాజీపాటిల్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అరుణకు నీలేష్ పాటిల్‌తో 2023లో వివాహం అయింది. ఇద్దరు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండడంతో 2025, జనవరిలో నల్లగండ్లలో ఉంటున్నారు. భార్యభర్త మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త వేధింపులను తట్టుకోలేక అరుణ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News