ఫార్ములా ఈ..కార్ రేస్ కేసులో ఐఎఎస్ అరవింద్ కుమార్‌కు ఎసిబి మరోసారి నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఎసిబి నోటిసుల్లో పేర్కొంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ ఫార్ములా కార్ రేస్‌లో నిబంధనలకు విరుద్దంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఎ1, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఎ2, హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని ఎ3 నిందితులుగా చేర్చారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఐఎఎస్ అరవింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డిలను ఇప్పటికే ఎసిబి అధికారులు విచారించారు. కెటిఆర్‌ను ఇటీవల విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన స్టెట్‌మెంట్‌తో ఐఎఎస్ అరవింద్ కుమార్‌ను విచారించేందుకు నోటిసులు ఇచ్చినట్లు సమాచారం.
ఐఎఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి ఎసిబి నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -